చరణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడట

295
- Advertisement -

తన భారీ స్కేల్ సినిమాలతో తన మేకింగ్ స్టైల్ తో ఇండియన్ సినిమా హిస్టరీ లో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ అనంతరం అదే మీడియాతో జక్కన్న ఓ చిట్ చాట్ చేశాడు. అందులో భాగంగా వచ్చే ఏడాది మీరు ఎదురుచూస్తున్న విషయం ఏమిటనే ప్రశ్నకి ఆన్సర్ చెప్తూ చరణ్ సినిమాపై హైప్ పెంచేశాడు.

నేను సినిమా వాడిని కాబట్టి సినిమాల కోసమే ఎదురుచూస్తుంటా. వచ్చే ఏడాది నేను అలా ఎదురుచూసే సినిమాల్లో రామ్ చరణ్ -సుకుమార్ సినిమా ఒకటి. చరణ్ ఆ సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి చెప్పాడు. నాకు చాలా నచ్చింది. వారిద్దరి కాంబో సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకున్నారు జక్కన్న.

రాజమౌళి ఇచ్చిన ఈ అప్ డేట్ తో త్వరలోనే రామ్ చరణ్ -సుకుమార్ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని మెగా ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చింది. రంగస్థలం తో రికార్డులు తిరగరాసిన ఈ కాంబో సినిమా ఈసారి ఎలాంటి సినిమాతో రాబోతుందో అని రాజమౌళి మాటలు వింటూ మూవీ లవర్స్ భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమాతో పాటు బుచ్చి బాబు సినిమాను కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ లోపు సుకుమార్ పుష్ప 2 ఫినిష్ చేసి చరణ్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నాడు.

ఇవి కూడా చదవండి…

పుట్టినరోజు… ఆది శబ్దం

టాప్ టెన్‌ ఐఎండీబీ మూవీస్‌…

- Advertisement -