మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారు రామ్ చరణ్. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ పిక్‌లో చరణ్ గుబురు గడ్డం, చిన్న పిలక, సిక్స్ ప్యాక్ బాడీతో ఉండగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read:నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు

