మాస్టర్‌ చెఫ్‌గా మారిన మిస్టర్ సీ..

258
Ramcharan Cooking Breakfast For Upasana
- Advertisement -

తాజా చిత్రం ‘రంగస్థలం’తో బంపర్ హిట్ అందుకుని ఆ ఆనందంలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తదుపరి చిత్రం సెట్స్ పైకి వెళ్లేలోగా కొంత సేదదీరాలని భావిస్తున్నాడు. ఏప్రిల్ 21 నుండి జ‌ర‌గ‌నున్న నెక్ట్స్ షెడ్యూల్‌లో చ‌ర‌ణ్ .. బోయ‌పాటి టీంతో క‌ల‌వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో గడుపుతూ, కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించే పనిలో ఉన్నాడు. అయితే చ‌ర‌ణ్‌కి సంబంధించిన విష‌యాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి తెలియ‌జెప్పే ఉపాస‌న తాజాగా త‌న ట్వీట్‌లో ఒ పోస్టు పెట్టింది.

Ramcharan Cooking Breakfast For Upasana

ఉపాసన కోసం వంట చేసి పెట్టగా, ఆ ఫొటోలను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. “మాస్టర్ చెఫ్… మిస్టర్ సీ… హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ను మా కోసం చేస్తున్నారు” అని పోస్టు చేసింది. ఈ చిత్రాల్లో రామ్ చరణ్ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫోటోల‌పై నెటిజ‌న్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. గ‌తంలో చిరు కూడా గ‌రిటె ప‌ట్టిన ఫోటోని ప‌క్క‌న పెట్టి కంపేర్ చేస్తున్నారు.

- Advertisement -