రంగస్థలం అందించిన సక్సెస్‌తో మంచి జోష్ మీదున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చెర్రీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా టాలీవుడ్ క్లాసిక్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్న చరణ్ మరోవైపు బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతున్నాడు.
గత కొంత కాలంగా ఎన్నో ప్రచార సంస్థలు సంప్రదిస్తున్న వారందరికి సున్నితంగా నో చెబుతూ వస్తున్న రామ్ చరణ్ ఎట్టకేలకు హప్పీ మొబైల్ స్టోర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఓకే చెప్పాడు. ప్రచార కార్యక్రమంలో చెర్రీ…సంతకం చేశారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం లాట్ మొబైల్స్ స్టోర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా రామ్ చరణ్ హప్పి మొబైల్ స్టోర్ ప్రచారంకు సైన్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. లాట్ మొబైల్స్ మరియు హప్పి మొబైల్ స్టోర్స్ మద్య ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు చెరో స్టోర్‌కు ప్రచారం చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతుంది.
ఇప్పటికే రాంచరణ్ ట్రూజెట్‌తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించాడు. మెగాస్టార్ చిరంజీవి సైతం గతంలో థమ్స్ అప్‌తో పాటు పలు ప్రచార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు. అంతేగాదు మాటీవీని సక్సెస్ ఫుల్‌గా రన్ చేసిన చిరు ఇటీవలె సచిన్‌తో కలిసి ఓ కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి చిరు బాటలోనే పయనిస్తున్న రాంచరణ్..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.