మళ్ళీ డాన్స్‌కు సై అంటున్న రంభ….

1091
- Advertisement -

టాలీవుడ్ లో స్టార్ హీరోలతో ఒకప్పుడు ఆడిపాడిన హీరోయిన్‌ రంభ… గ్లామర్ పాత్రలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. హాట్ హాట్ అందాలతో యూత్ మతిపోగొట్టసింది. ఈ అందాల భామ మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈసారి వెండితెర మీద కాకుండా బుల్లితెరపై సందడి చేయనుంది రంభ .

Rambha entry tollywood

బుల్లితెరపై జడ్జీ పోస్టులకి ఫుల్ గిరాకీ ఉంది. జబర్దస్త్‌ ప్రారంభం అయినప్పటి నుంచి రోజ జబర్దస్త్‌లో జడ్జిగా నే కొనసాగుతున్న విషయం తెలిసిందే. రంభ కూడా జడ్జీగా వ్యవహరించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు జీ-తెలుగు ఛానల్‌ ఆమెతో ఒప్పందం కుదుర్చుకొంది. జీ తెలుగులో ప్రసారం అవుతోన్న ‘ఏబీసీడీ’అనే డాన్స్‌ ప్రోగ్రామ్‌లో రంభ జడ్జీగా కనిపించనుంది. రంభ రానుండటంతో ఈ ప్రోగ్రాఫ్ టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయని జీ-యాజమాన్యం భావిస్తోంది.

Rambha entry tollywood

హీరోయిన్‌గా ఉన్న రోజుల్లో రంభ అందానికి, డ్యాన్సులకు కుర్రకారు వెర్రెత్తిపోయేవారు. అందుకేనేమో ఆమె ఇప్పడు డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా వ్యవహరించనుంది. డ్యాన్స్‌లో రంభ స్టైల్ చాలా బాగుంటుందని అందుకే ఆమెను జడ్జిగా ప్రకటించినట్లు తెలుస్తుంది. రాబోయేరోజుల్లో వెండితెరపై రంభ రీఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ ప్రముఖులు అంటున్నారు.

Rambha entry tollywood

ఇటీవలే కాలంలో రంభ సంసారంలో కలతలు ఏర్పాడాయని వార్తలు వచ్చాయి. ఆమె తన భర్తతో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఓ వైపు సంసారాన్ని నిలబెట్టుకునేందుకు ట్రై చేస్తూనే.. సెకండ్ ఇన్నింగ్స్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది రంభ.

- Advertisement -