నటి రంభ విడాకుల కేసు సుఖాంతమైంది. ఇంద్రన్‌కుమార్, రంభ కలసి జీవించేందుకు కోర్టు సమ్మతించింది.రంభ నటనకు స్వస్తి చెప్పి 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్‌కుమార్‌ను పెళ్లి చేసుకొని కెనడాలో స్థిరపడింది. ఆరేళ్లపాటు హాయిగా సాగిన వీళ్ల సంసారంలో ఇటీవల గొడవలు మొదలైయ్యాయి. ఈ క్రమంలోనే కెనడా నుంచి చెన్నై వచ్చిన రంభ… కొన్ని నెలల నుంచి భర్తకు దూరంగా ఉంటుంది. దీంతో రంభ భర్త పద్మనాభన్ విడాకులు కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ విడాకులు మంజూరు చేయాలని కోరుతూ 2016లో రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ.2.50 లక్షలు చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని కోరింది. దీనిపై పలుమార్లు విచారణ నిర్వహించిన కోర్టు.. ఇంద్రన్‌కుమార్‌తో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. ఈ మేరకు చర్చించుకున్న రంభ, ఇంద్రన్‌కుమార్‌లు కలసి జీవించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని వీరిద్దరూ బుధవారం న్యాయస్థానానికి తెలియజేయడంతో కేసును మూసివేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
దక్షిణాది హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్‌ల ప్రేమ పెళ్లి పెటాకులైన సంగతి మనకు తెలిసిందే. విజయ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో అమలాపాల్ హీరోయినగా నటించడం, ఇద్దరూ ప్రేమలో పడడం, పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా వీరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.