- Advertisement -
శరత్ మండవ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ నెల 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.17.20 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. నైజాం – 5 కోట్లు, సీడెడ్ – 3 కోట్లు, ఏపీ – 7 కోట్లు,
రెస్టాఫ్ ఇండియా – 1 కోట్లు, ఓవర్సీస్ – 1.2 కోట్లు, టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.17.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
రవితేజ సరసన అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా ఇప్పటికే టైటిల్ మొదలుకొని ట్రైలర్ వరకు ఆడియెన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
- Advertisement -