- Advertisement -
శ్రీవారి దర్శనాలను కొన్నిరోజుల పాటు నిలిపివేసి అర్చకుల ప్రాణాలు కాపాడాలని ఏపీ సీఎం జగన్,టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విజ్ఞప్తిచేశారు ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో భక్తులను దర్శనాలకు అనుమతించవద్దని తెలిపారు.
ఆలయంలో పనిచేసే అర్చకుల స్థానంలో వేరొకరిని తీసుకురాలేమని, వేంకటేశ్వరుని నిత్య ఆరాధనలు ఆపితే మానవ జాతికి మంచిది కాదని పేర్కొన్నారు.శ్రీవారికి జరిగే నిత్యపూజలను ఏకాంతంగా చేయడం వల్ల అర్చకుల ప్రాణాలను కాపాడినవారమవుతామని తెలిపారు.
దేవస్థానంలో పనిచేస్తున్న మొత్తం 50 మంది అర్చకుల్లో 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారంతా క్వారంటైన్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. శ్రీవారి ఆలయ పెద్దజీయర్ స్వామికి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన్ని ఆలయంలోని పద్మావతి క్వారంటైన్‌కు తరలించారు.
- Advertisement -