నెయ్యి కల్తీ జరగడం విచారకరం: రమణ దీక్షితులు

6
- Advertisement -

తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, గౌరవ సలహాదారుడు రమణ దీక్షితులు స్పందించారు. కల్తీ నెయ్యి వ్యవహారంప చాలా బాధపడ్డానని చెప్పారు. స్వామివారికి ఎటువంటి అపచారాలు జరగకుండా పూజలు చేశాను… మనకు అన్నం పెట్టే దేవుడికి శుచిగా నైవేద్యం పెట్టాలి కానీ నెయ్యి కల్తీ జరగడం చాలా విచారకరమని అన్నారు.

చాలాసార్లు నైవేద్యాలు క్వాలిటీ లేదని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు అన్నారు. ఐదు సంవత్సరాలు అక్రమాలు జరిగిపోయాయని రమణ దీక్షితులు చెప్పారు. తిరుమలలో సేవ చేయడానికి ఆగమాలు తెలిసిన వారిని సేవకులుగా నియమించాలని…. నెయ్యి కల్తీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ అక్రమాలను ప్రశ్నిస్తే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు రమణ దీక్షితులు. తనకు అవకాశం ఇస్తే ఇటువంటివి సరిదిద్దుతాను… నాపైన ఉన్న తప్పుడు కేసులు ఈ ప్రభుత్వం తొలగించాలన్నారు.

Also Read:ఆకలి వేయట్లేదా..ఇలా చేయండి!

- Advertisement -