- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు నియామకమయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండగా ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది.
1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనున్నది.
14 సార్లు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లను తీర్చిదిద్దారు. ఇందులో 12 పూరిస్థాయి.. మరో రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లను తీర్చిదిద్దారు. తొలిసారిగా 2014 నవంబరు 5న పూర్తిస్థాయి బడ్టెట్‌ని ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతూ రాగా.. తాజాగా ప్రభుత్వం ఆయనను సీఎస్‌గా నియమించింది.
- Advertisement -

