- Advertisement -
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు రామగుండం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇవాళ బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ని కలిసిన చందర్.. టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్టు తెలిపారు.
ఎన్నికల ముందు వరకు తాను టీఆర్ఎస్ లోనే ఉన్నానని తెలిపారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ నాయకత్వంలోనే తాను పని చేశానని చెప్పారు. తన మాతృ సంస్థ టీఆర్ఎస్సేనని అన్నారు.
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. కారు దూకుడు కాంగ్రెస్ దిగ్గజాలు మట్టికరిచారు. టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ కూటమి 21 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక బీజేపీ 1,ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చందర్ టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
- Advertisement -