ఎమ్మెల్సీ బల్మూరిని ఓడించండి..కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడియో వైరల్

11
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అనుబంధ సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరికి సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది.

యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌‌గా వెంకట్‌‌ను గెలవనీయకుండాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కామెంట్స్ చేశారు. వెంకట్‌కు ఓటేయొద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్.

ఒక్కరికే రెండు పదవులు ఉంటే ఎట్లా.. ఎమ్మెల్సీ పదవి ఉండగా యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎందుకని బాహాటంగానే ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:TTD:భార‌తీయ సంస్కృతికి ఆగ‌మ శాస్త్ర‌మే ప్ర‌మాణం

- Advertisement -