- Advertisement -
నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మత పెద్దలు ప్రకటించారు. దీంతో ఇవాళ్టి నుండి ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి.
రంజాన్ నెలలో 30 రోజులు ఉపవాస దీక్షలు పాటించనున్నారు ముస్లింలు. ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులు ముస్తాభయ్యాయి. రంజాన్ పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ఉపవాస దీక్షల నేపథ్యంలో రేపట్నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉర్దూ విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
Also Read:వేరుశెనగలతో అద్భుత ప్రయోజనాలు
- Advertisement -