రామారావు..మరో అప్‌డేట్

32
- Advertisement -

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ రామారావు ఆన్ డ్యూటీ. శ్రీ ల‌క్ష్మివెంక‌టేశ్వ‌రా సినిమాస్, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో కలిసి ర‌వితేజ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించగా ఈనెల 28న సినిమా విడుదల కానుంది.

తాజాగా సినిమా నుండి మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు.రామారావు యూనిట్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం ఎంత క‌ష్ట‌పడుతున్నారో ఓ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట వైర‌ల్‌గా మారింది.

ఈ చిత్రంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను నెల‌కొల్పింది. దివ్యాంక కౌశిక్, రాజిషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. చాలా కాలం త‌ర్వాత సీనియ‌ర్ న‌టుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు.

- Advertisement -