Modi:రామరాజ్యం ప్రారంభమైంది

30
- Advertisement -

నేటి నుండి రామరాజ్యం ప్రారంభమవుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ అనంతరం మాట్లాడిన మోడీ… మన రాముడు మళ్లీ వచ్చాడని అన్నారు. టెంట్ కింద ఉన్న రాముడు.. దివ్వమైన మందిరంలోకి వచ్చాడని ఇది దేశ ప్రజలందరికి శుభదినం అన్నారు.

గత 500 సంవత్సరాలుగా మనం ఈ పని చేయలేక పోయామని కనుక రాముడిని క్షమించమని అభ్యర్థిస్తున్నామని చెప్పారు. రాముడి అరణ్యవాసం కేవలం 14 ఏళ్లు, కానీ ఇక్కడ మేము 500 సంవత్సరాలు వేచి ఉన్నామని గుర్తు చేశారు.ఇవాళ ప్రతీ ఇంటిలో దీపాలు వెలుగుతాయన్నారు.

ఆలయ నిర్మాణంతో 500 ఏళ్ల కల నెరవేరిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైందని, ఈ క్షణం కోసం దేశమంతా ఎన్నో ఏళ్లు ఎదురుచూసిందని తెలిపారు. అభిజిత్ లగ్నంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకెన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకెన్ల మధ్య విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిపించారు.

Also Read:మహేశ్‌ ఆ శిక్షణ కోసమే వెళ్ళాడట

- Advertisement -