తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష ఎన్నిక దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామచందర్ రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.ఈ ఇద్దరూ ఇవాళ నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల ఎంపిక పూర్తికాగా.. మిగిలిన రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై బీజేపీ దృష్టి సారించింది. ప్రధానంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఎంపీ ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్ సహా పలువురు నేతల పేర్లు వినిపించగా అధిష్టానం తొలి నుండి పార్టీలో ఉన్న రామచందర్ రావు పేరే దాదాపు ఖరారైంది.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఓ కొలిక్కి రాగా ఎవరి పేరు ఫైనల్ అవుతుందోనన్న ఉత్కంఠ మాత్రం బీజేపీ శ్రేణుల్లో నెలకొంది.
Also Read:రాజమండ్రిలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’

