రామ్ ను కలవరపెడుతున్న’స్కంద’?

47
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ స్కంద. వారియర్ మూవీతో డిజాస్టర్ మూటగట్టుకున్న రామ్ ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. అఖండ మూవీతో బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకుడు కావడంతో మూవీపై ఒకవర్గం ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది. దానికి తోడు టీజర్ కు మంచి స్పందన రావడంతో మూవీపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రా యూనిట్ ప్రకటించడంతో పాన్ ఇండియా స్థాయిలో రామ్ పోతినేని మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం గ్యారెంటీ ఆయన అభిమానులు భావించారు..

అయితే ట్రైలర్ రిలీజ్ తరువాత అంచనాలన్నీ తారుమారయ్యాయి. ట్రైలర్ లో మొత్తం రొటీన్ గా ఉండడం బోయపాటి మార్క్ ఓవరాక్షన్ ఫైట్స్ రామ్ కు సెట్ కాలేదని టాక్ వినిపించడంతో మూవీ పై ఉన్న బజ్ మొత్తం తగ్గిపోయింది. దానికి తోడు మూవీ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నప్పటికి చిత్రా యూనిట్ ఇంతవరకు ఎలాంటి ప్రమోషన్స్ ప్రారంభించలేదు. మొదట ఈ మూవీని వినాయకచవితి కనుకగా విడుదల చేయాలని భావించినప్పటికి.. సలార్ వాయిదా పడడంతో సెప్టెంబర్ 28కి పోస్ట్ పోన్ చేశారు. అయిన రిలీజ్ కి ఇంకా వారం రోజులే ఉన్నప్పటికి మూవీకి సంబంధించి ఎలాంటి హడావిడి జరగడం లేదు. దానికి తోడు ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని భావించి ఇప్పుడు ఆ ఆలోచనను చిత్రయూనిట్ విరమించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ మూవీ హిట్ పై చిత్రయూనిట్ కే నమ్మకం లేదా అనే రామ్ అభిమానులు కలవర పడుతున్నారు. మరి ఫుల్ మాస్ మసాలా మూవీగా వస్తున్న స్కంద రామ్ కు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

Also Read:బీజేపీ గాడిన పడడం కష్టమే..?

- Advertisement -