వైసీపీపై రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు

415
ram madhav
- Advertisement -

వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన రాంమాధవ్‌ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా తయారైందని టీడీపీ,వైసీపీలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ తప్పటడుగుల వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందోన్న భయం ప్రజల్లో ఉందన్నారు.

ఒక ప్రాంతీయ పార్టీపై వ్యతిరేకతతో ఏపీ ప్రజలు మరో ప్రాంతీయ పార్టీకి అధికారం ఇచ్చారని కానీ అది తప్పని కొద్దిరోజుల్లోనే రుజువవుతోందని ఆరోపించారు. ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో వైసీపీ సన్నిహితంగా ఉంటుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రాంమాధవ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -