ప్రముఖులపై పొగడ్తలు, సెటైర్లు లేదా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పడ్డాడు. ఇందుకు చిల్డ్రన్స్ డే సందర్భమైంది. కేజ్రీవాల్‌కు హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటూ వర్మ ట్వీట్ చేశాడు. సాధారణంగా చిన్న పిల్లలకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెబుతారు. అలాంటిది వర్మ ఢిల్లీ సీఎంకు చెప్పడంతో మరోసారి వర్మ కామెంట్ హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.
అసలు వర్మ ఏ ఉద్దేశ్యంతో కేజ్రీవాల్‌కు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్పాడు అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి ఈ డిల్లీ ముఖ్యమంత్రికే పంపడం వెనక తాత్పర్యం ఏంటనే గుసగుసలు వినబడుతున్నాయి. ట్విట్టర్ వేదికగా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వర్మ…కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు తెలుపుతూ మరోసారి వార్తల్లో నిలిచాడు.
కేజ్రీవాల్ కు వర్మ చేసిన ట్విట్ పై నేటిజన్లు ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ దేశంలోనే అతిపెద్ద కంప్లెయిన్ బాక్స్ అని, అందుకే ఆయనకు వర్మ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్పారని ఓ నెటిజెన్ స్పందించాడు. కేజ్రీవాల్‌తో పాటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు చెప్పడం వర్మ మరిచాడా లేక కావాలనే వదిలేశాడా? అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
సినీ, రాజకీయ ప్రముఖులపై సందర్భం దొరికినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేసే వర్మ ఈసారి కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశాడు. మరి దీన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి. అంతేకాదు కేజ్రీవాల్ లుక్స్,,దీపికా పదుకోన్ చూపుల చాలా హాట్‌గా ఉందని కామెంట్ చేశాడు.