ఇప్పుడు వర్మకు తిప్పలు తప్పడంలేదు. ఆయన ఏది అనుకున్నా… బెడిసికొడుతోంది. మరి దీనంతటికి కారణం వర్మ మారడమేనా? వర్మ మారినందుకే అతన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయా ? అంటున్నారు ఆయన ఫ్యాన్స్. సక్సెస్‌లు అందుకుంటూ వోడ్కా పార్టీలు చేసుకునే వర్మకి ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు.
ప్రస్తుతం ఆయన చేస్తున్న కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోతుంటే, మరికొన్ని సినిమాలు రిలీజ్‌లకు కూడా నోచుకోవడంలేదు. విషయం ఏమంటే వర్మ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరకెక్కించిన సినిమా ‘సర్కార్3’. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. నిజానికి ఈ సినిమాను వర్మ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు.
కానీ ఇప్పుడా ప్లాన్ వర్కౌట్ కావడంలేదు. ఎందుకంటే.. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా అసంపూర్ణంగా ఉండడం వల్ల రిలీజ్ చేయలేకపోతున్నామని, అందుకే ఈ సినిమాని ఏప్రిల్ 7 నుంచి మే 12కు వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే..ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కి తోడు వర్మకి మరో సమస్య వచ్చిపడింది. ఇప్పటికే ‘సర్కార్3’ సినిమా కథ నాది అంటూ ఓ రైటర్ కోర్టు గడప తొక్కిన సంగతి తెలిసిందే. ఈ వాయిదాతో బిగ్ బి అమితాబ్ సహా వర్మ ఫ్యాన్స్ ఈ వాయిదాతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వర్మకు ఎంతగానో కలిసొచ్చిన సర్కార్ సిరీస్‌లో ఈ సినిమా తిరిగి కంబ్యాక్ మూవీ అవుతుందనుకుంటే మధ్యలోనే ఇలా అయ్యిందేంటి? అనే గుసగుసలు ఇప్పటికే మొదలయ్యాయి.