బాహుబలి2 సినిమాపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ల వర్షం ఇప్పుడు సునామీలా మారుతోంది. మరి బాహుబలి పై ఇంతలా వర్మ ఎందుకు ఫోకస్ పెట్టాడో తెలీదుగానీ..ప్రతి రోజూ తన ట్వీట్లలో ఖచ్చితంగా ‘బాహుబలి’ పేరు మార్మోగుతోంది.
అయితే..గత కొన్ని రోజులుగా బాహుబలిని, అందులో నటింనినవారిని పొగుడుతూ సోషల్ మీడియాలో ట్వీట్‌లు చేస్తున్న వర్మ, ఇప్పుడు మరో కాంట్రవర్శికి తెరలేపాడు. రిలీజ్ కు ముందునుంచే బాహుబలిపై ట్వీట్లతో కూస్తున్న వర్మ, సినిమా రిలీజ్ తర్వాత కూడా వర్మ ట్వీట్‌కూత ఊపందుకుంది.
ఇప్పటివరకూ బాహుబలి మీద ట్వీట్లు చేసిన వర్మ ఇప్పుడు రూటూ మార్చేశాడు. వర్మ దృష్టి ఇప్పుడు హీరోల కులాల మీద పడింది. మరోసారి తన పంథాలో టాలీవుడ్ హీరోల కులాలపై, వారి అభిమానులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ కులానికి సంబంధించి వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు పెనుదుమారాన్నే రేపుతోంది. ప్రభాస్‌ను పొగుడుతూ మిగిలిన హీరోలపై ఆయన స్టైల్ లో సెటైర్లు వేశాడు వర్మ.
ఇతర హీరోలు కాపులు, కమ్మలపై శ్రద్ధ చూపినట్టు.. ప్రభాస్ తన కులమైన రాజులపైనే ఫోకస్ పెట్టుంటే ఇంత క్రేజ్ వచ్చేది కాదని వర్మ ట్వీట్ చేశాడు. ప్రభాస్ అలా ఆలోచించలేదని, ఒక వేల అలా ఆలోచించి ఉంటే..లోకల్ స్టార్ గానే మిగిలిపోయేవాడని,అలా చేయకపోవడం వల్లే ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యాడని వర్మ ట్వీట్ చేశాడు.
ప్రభాస్ ఇక నుంచి లోకల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించాల్సిన పని లేదని, ఎందుకంటే అతనికి నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారని వర్మ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా లోకల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించే స్టార్స్ ఎప్పుడూ లోకల్ స్టార్స్ గానే మిగిలిపోతారని అన్నాడు. ఇదే క్రమంలో వర్మ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్స్ చేసి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని కొందరి అభిప్రాయంగా తెసుస్తోంది. ఏదేమైనా.. వర్మ ఏ హీరోలనుద్దేశించి ఈ మాటలన్నాడో కానీ, ఇప్పుడు మాత్రం ఇవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.