- Advertisement -
ఎప్పుడూ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే వర్మ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకెక్కాడు. మార్చి8 ఉమెన్స్ డే సందర్భంగా మహిళను ఉద్దేశించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల సెగ ఇంకా తగ్గలేదు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన వర్మ క్షమాపణ చెప్పాలని ఎన్‌సీపీ పార్టీ నాయకురాలు, మహారాష్ట్ర ఎమ్మెల్సీ విద్యా చవాన్ డిమాండ్ చేశారు. లేదంటే వర్మపై చెప్పుల దాడికి దిగుతామని హెచ్చరించారు.
ఈ అంశంపై ఇప్పటికే గోవా సామాజిక కార్యకర్త ఒకరు కేసు నమోదు చేయగా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఇదే తరహా విమర్శలు వెల్లువెత్తాయి. అటు సోషల్ మీడియాలోనూ వర్మపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు కొందరు నెటిజన్లు. మహిళా దినోత్సవం రోజు ఆర్జీవీ ట్విటర్లో పోస్టు చేస్తూ ‘‘మహిళలంతా సన్నీలియోన్‌లా సంతోషపరచాలి’’ అంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
- Advertisement -