చంద్రబాబు.. నరహంతకుడు

48
- Advertisement -

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు ఆర్జీవీ. కందుకూరు, గుంటూరు ఘటనల్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై దారుణ విమర్శలు చేశారు. కందుకూరు సంగతి పక్కన పెడితే గుంటూరు ఘటనపై తనకు ఉన్న మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అన్నారు. ఎక్కువమంది జనాలు పెద్ద గ్రౌండ్‌లో పెడితే రారని.. పాపులారిటీ తగ్గిపోతుందని అందరికి తెలిసిపోతుందనే భయంతో ఇలా చేశారని చెప్పుకొచ్చారు.

గతంలో ఎన్నిసార్లు సీఎం అయ్యారు.. ప్రజల గురించి ఆమాత్రం తెలియదా అన్నారు. ప్రజల ప్రాణాలు గడ్డి పూచతో సమానంగా భావించారని విమర్శించారు. పర్సనల్ ఇగో, గెయిన్ ముఖ్యమా.. ఎంతమంది పోతే అంత పాపులారిటీ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా చేశారని ఆరోపించారు. 40 అనుభవం ఉంది కదా ఏం జరుగుతుందో తెలియదా అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు మనుషుల ప్రాణాల కంటే పాపులారిటీ, ఫేమ్ ముఖ్యం అన్నారు. రాజకీయాల్లో ప్రజల భద్రత ముఖ్యమనే విషయాన్ని మర్చిపోతే ఎలా …హిట్లర్ ముస్సోలిని తర్వాత చంద్రబాబునే చూస్తున్నాను అన్నారు. శవాలపై నిల్చుని పాపులారిటీ పెంచుకోవడం దారుణమన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -