- Advertisement -
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి జవహర్ సెటైర్లు వేశారు.. మాట తప్పను, మడమ తిప్పను అంటూ జగన్ చెబుతుంటారని… అదంతా ఓ మాయ అని అన్నారు. నవంబర్ 2నుంచి పాదయాత్ర చేస్తామంటున్నారు.. జగన్ చేయబోయేది పాదయాత్ర కాదు.. పాపపరిహార యాత్రని జవహర్ వ్యాఖ్యానించారు. పాదయాత్రను ఎందుకు చేయబోతున్నారో కూడా జగన్ కే స్పష్టతలేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో నిత్యం అలజడులు సృష్టించే జగన్.. పాదయాత్ర ద్వారా ఎలాంటి అల్లర్లు సృష్టిస్తారోనని ఆందోళన వ్యక్తం చేసిన జవహర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయాల్సింది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కాదని, జగన్ 420 టైటిల్ తో సినిమా తీయాలని ఎద్దేవా చేశారు.
- Advertisement -