చిరు లాంటి అన్నయ్య నాకుంటే…

197
Ram Gopal Varma Says Sorry
- Advertisement -

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో న్యూస్ లో ఇటీవలె అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ప్రతీ సందర్భాన్ని వివాదం చేసే వర్మ ఇకపై ఎవరినీ కించపరిచేలా వ్యాఖ్యలు చేయనని తెలిపాడు. అందుకు తగ్గట్టుగానే వర్మ గతంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాడు. తనపై చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని పేర్కొన్నారు. ఆయనకు నిజంగా క్షమాపణ చెబుతున్నా’ని వర్మ ట్వీట్‌ చేశారు.

నా లాంటి వాడు ఎవరైనా కామెంట్స్ చేస్తే నాగబాబు కేవలం మాటలతో వదిలేసాడు….అదే చిరంజీవి నా అన్నయ్య అయితే, నా లాంటి వాడు ఎవరైనా కామెంట్స్ చేస్తే నాగబాబు లా మాటలతో వదిలేసే వాడినికాదు….. ఆ స్థానంలో నేను ఉంటే కొట్టే వాడిని అని వర్మ పేర్కొన్నారు. నేను తప్పుగా మాట్లాడాను కాబట్టే… నాగబాబు నాపై ఆ రోజు ఫైర్ అయ్యారు. ఆయన అలా ఫైర్ అవ్వడానికి నా వ్యవహార శైలే కారణం…….. అని వర్మ తెలిపారు.

వరుణ్ తేజ్ .. మీ నాన్న గురించి, నా గురించి నువ్వ చేసిన కామెంట్లు చదివాను. నువ్వు చెప్పింది కరెక్ట్. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాను’ అని వర్మ ట్వీట్ చేశారు.

రామ్ చరణ్ గురించి, చిరంజీవి గరించి మెగా ఫ్యామిలీ గురించి వర్మ వివాదాస్పద కామెంట్స్, వారిని తక్కువ చేసి కామెంట్స్ చేయడంపై… నాగబాబు ‘ఖైదీ నెం 150′ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -