బాలయ్యకు పొగడ్తలు..చిరుకు చురకలు

221
- Advertisement -

సంచలన కామెంట్లు..వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌ గా మారిన ఏస్‌ డైరెక్టర్ రామ్ గోపాల్‌ వర్మ మరోసారి తన ట్వీట్టర్‌కు పని చెప్పాడు. ఈసారి చీరంజీవి..బాలయ్య సినిమాలపై కామెంట్లు విసిరాడు. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌ను అద్భుతంగా పొగిడేశాడు వర్మ.‘‘శాతకర్ణి’ బరిలోకి దిగిన తర్వాత.. సంక్రాంతి ఫైట్స్‌ ఉండబోవు. చూస్తుంటే వార్‌ వన్‌సైడ్‌లా ఉంది’ అంటూ పరోక్షంగా తన వ్యాఖ్యలకు పదును పెట్టాడు. ఎందుకంటే సంక్రాంతికి బాలయ్య సినిమాతో పాటు చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150’ కూడా రిలీజ్ అవుతుండడంతో..వర్మ మాటలకు ప్రధాన్యత సంతరించుకుంది. అంతటితోనే ఆగకా మెగాస్టార్‌ను టార్గెట్‌ చేస్తూ వరుస ట్వీట్లు చేశాడు.

varma

‘కత్తి కంటే మెగా షార్ప్‌ ట్రైలర్‌ ‘శాతకర్ణి’దే’ అని వెంటనే రెండో ట్వీట్‌ చేశాడు. చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150’ తమిళ ‘కత్తి’కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా ‘ఒక మెగా అభిమానిగా చిరంజీవి ‘గౌతమిపుత్ర’ లాంటి సినిమా చేసి తెలుగు సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాన’ని మరో ట్వీట్‌ చేశాడు. అలాగే మెగా ఫ్యాన్స్ కు కూడా ఓ సవాల్ విసిరాడు. ‘మీరు నిజంగా మెగాఫ్యాన్స్‌ అయితే మెగాస్టార్‌కు ‘బాహుబలి’, ‘శాతకర్ణి’ లాంటి సినిమాలు చేయమని చెప్పండ’ని అభిమానులకు కూడా సందేశం ఇచ్చాడు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులు..వర్మ కామెంట్ల ఎలా స్పందిస్తారో చూడాలి.

varma

- Advertisement -