శ్రీదేవి గురించి వర్మ చెప్పిన నిజం..

266
Ram Gopal Varma Reveals Funny Moment with Sridevi
- Advertisement -

దర్శకుడు రామ్‌గాపాల్‌ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ దర్శకుడు మరో సారి వార్తల్లో నిలిచాడు. శ్రీదేవిని ఎంతమంది ఎంత పిచ్చిగా అభిమానించి.. ఆరాధించినా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అభిమానం ముందు మాత్రం దిగదుడుపే. సాధారంగా ఒక ప్రముఖ సినీ తార అంటే ఇష్టమని మరో ప్రముఖ సెలబ్రిటీ చెప్పటం తక్కువ. ఒకవేళ చెప్పినా.. ఎంత చెప్పాలో అంత చెప్పేసి ఊరుకుంటారు. కానీ.. వర్మ స్టైల్ వేరు. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసే ఆయన.. శ్రీదేవి అంటే ఆయనకెంత అభిమానమన్న విషయం అందరికి తెలిసిందే. శ్రీదేవిని తానెంతగా అభిమానిస్తానో కథలు..కథలుగా చెప్పటమే కాదు.. శ్రీదేవి భర్త బోనీకపూర్ మీద తనకున్న జెలస్ గురించి ఓపెన్ గా మాట్లాడి షాకిచ్చాడు.

అలాంటి వర్మ తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీదేవికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట తాను తీసుకున్న సినిమాతో మళ్లీ వార్తల్లోకి వచ్చిన వర్మ.. తన ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి చెప్పిన విషయం ఇప్పటివరకూ బయటకు రానిది కావటం విశేషం.

Ram Gopal Varma Reveals Funny Moment with Sridevi

క్షణక్షణం సినిమా షూటింగ్ ఒక అడవిలో తీస్తున్నాం. షూటింగ్ స్పాట్ టౌన్ కి దూరం. శ్రీదేవిగారి తొడ దగ్గర ఏదో కుట్టి పుండులా తయారైంది. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుపోతుందని భయం. డాక్టర్ ను తీసుకురమ్మని ప్రొడక్షన్ మేనేజర్ ను పంపించాం. ఒక డాక్టర్ ను తీసుకొచ్చారు. అతడు ఎలా ఉన్నాడంటే.. పొట్టిగా.. నల్లగా ఉన్నాడు. నేను బయటకు వెళ్లి ప్రొడక్షన్ మేనేజర్ ను అడిగితే ఆర్ ఎంపీ అన్నాడు. వాడ్ని చూసిన శ్రీదేవి.. ఇతను డాక్టరేనా? అని అంది. గాయం ఎక్కడ? అని అడిగాడు. స్కర్ట్ పైకి జరిపి తొడను చూపించింది. శ్రీదేవి తొడను అంత దగ్గరగా చూసిన వాడి ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ ఎప్పటికీ మర్చిపోలేను. వారు రెండు సిరంజీలు తీశాడు. అవి రెండు ఒక్కోరంగులో ఉన్నాయి. అప్పుడు శ్రీదేవి సందేహంగా.. మరోసారి కనుక్కోండి.. ఎందుకైనా మంచిది.. ఇతను డాక్టరేనా? అని అడిగింది. ఈ ఫన్నీ ఉదంతాన్ని ఎప్పుడూ మర్చిపోలేను అంటు వర్మ చెప్పుకొచ్చాడు.

అయితే జరిగిన విషయాన్ని మామూలుగా చెప్పొచ్చు కానీ.. వర్మ మార్క్ లో చెప్పిన ఆయన మాటల్ని చూస్తే మాత్రం కాస్త ఇదైపోవాల్సిందే. ఎంత అనుకున్నా.. వర్మ తానేం చెప్పాలనుకున్నాడో.. ఎలా చెప్పాలనుకుంటాడో అలానే చెబుతారు.

- Advertisement -