వర్మకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన కేఏ పాల్

272
Rgv With KA Paul

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సిద్దార్ధ తాతోలు తెరకెక్కించిన చిత్రం అమ్మరాజ్యంలో కడపబిడ్డలు. ఈమూవీ నవంబర్ 29న విడుదల కావాల్సి ఉన్న కోర్టు కేసు, సెన్సార్ నిరాకరణ కారణంగా ఈసినిమా వాయిదా పడింది. ముందు క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఫిక్స్ చేయ‌గా, ప‌లు కార‌ణాల వ‌ల‌న టైటిల్ చేంజ్ చేశారు. ఫైనల్ గా ఈసినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్లు తెలిపారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రస్తుత రాజకీయాల గురించి ఈసినిమాలో ప్రస్తావించారు వర్మ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌, చంద్రబాబు, నారా లోకేష్ , కేఏ పాల్ లను ఈసినిమాలో హైలెట్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ , టీజర్ , పాటలను విడుదల చేశారు.

ఈమూవీ విడుదల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈమూవీని విడుదల తేదీని ప్రకటించడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉన్నారు. తాజాగా వర్మ తన ట్వీట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అమ్మరాజ్యంలో కడపబిడ్డలు మూవీ సెన్సార్ సర్టిఫికేట్ ను అందుకుంటున్న ఫోటో ను షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://twitter.com/RGVzoomin/status/1203491190869389313