రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. తాను తీసిన సినిమాలతో కంటే..వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంట్రవర్శికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. వర్మ ఏది చేసినా అది సంచలనమే. అయితే రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలను ఎనౌన్స్ చేస్తూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు నాగార్జున హీరోగా తాను మరో సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘శివ’ అప్పట్లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది.
అయితే వీరి కాంబినేషన్లో రానున్న కొత్త సినిమా ముహూర్తాన్ని వర్మ అనౌన్స్ చేశాడు. నవంబర్ 20వ తేదీన ఉదయం 10.30 గంటలకు ముహూర్తం అంటూ ఫేస్ బుక్ లో ప్రకటించాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పాడు. తన తొలి సినిమా ‘శివ’ను తన తండ్రి మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రారంభించారని… ఈ కొత్త చిత్రాన్ని తన తల్లి మరియు తన మొదటి నిర్మాతలు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్రలు ప్రారంభిస్తారని వర్మ తెలిపారు. ప్రతి మూడు దశాబ్దాలకు ఒకసారి తాను ఎమోషనల్, సెంటిమెంటల్ అవుతానని ఈ సందర్భంగా అన్నాడు.