క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ విడుదల చేసిన వర్మ(వీడియో)

462
Rgv Caste Feeling Song
- Advertisement -

 వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఈమూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఏపీలో క్యాస్ట్ ఫిలింగ్ గురించి ఈసినిమాలో వివరించనున్నాడు దర్శకుడు వర్మ. ఇప్పటికే ఈసినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేసి సంచలనం సృష్టించారు వర్మ.

తాజాగా కొద్ది సేపటి క్రితమే ఈసినిమాకు సంబంధించిన క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ ను కూడా విడుదల చేశాడు. కమ్మలు… కాపులు… రెడ్లు… రాజులు… వైశ్యులు… అంటూ ఈ పాట మొదలవుతుంది. “నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం… నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు… ఈ ఫీలింగ్ లన్నీ కరెక్టయినపుడు, క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు? దేనికిరా… ఈ హిపోక్రసీ? ఎందుకురా… ఈ హిపోక్రసీ? అంటూ పాట సాగుతుంది. దేశాన్ని కీర్తిస్తే దేశ భక్తి అయినప్పుడు, కులాన్ని కీర్తించే కుల భక్తి ఎందుకు తప్పని ప్రశ్నించారు. ఆ సాంగ్ మీకోసం..

- Advertisement -