మనిషిగా బతికున్న రోజుల్లో..

193
Ram gopal varma with daughter
Ram gopal varma with daughter
- Advertisement -

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలే కాదు.. చేసే ట్వీట్లు కూడా వివాదస్పదంగా ఉంటాయి. రోజు సోషల్ మీడియాలో ఎవరినో ఒకరిని గెలకడం.. మళ్లీ సారీ చెప్పడం వర్మ లైఫ్‌ స్టైల్‌.. లేదా తన సినిమాల గురించి సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ఇప్పటివరకూ అభిమానులతో తన కుటుంబం గురించి పంచుకున్న విశేషాలేవీ లేవు. అలాంటిది వర్మ తాజాగా చిన్నప్పుడు తన కుమార్తె రేవతి వర్మతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

RGV

‘రాక్షసుడిగా మారకముందు మానవత్వం ఇంకా బతికున్న మంచి రోజుల్లో నా కూతురితో దిగిన ఫొటో ఇది’ అంటూ ట్వీట్‌ చేశారు. వర్మ తన కుమార్తె ఫొటోను పోస్ట్‌ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఎన్నో రీట్వీట్లు, లైకులు వస్తున్నాయి.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ అమితాబచ్చన్‌తో ‘సర్కార్ 3’సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్‌ పూర్తైనప్పటికీ.. కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని, వాటి పట్ల అసంతృప్తిగా ఉన్న వర్మ చాలా డిస్కషన్ల తర్వాత వాటిని రీ షూట్ చేయాలని నిర్ణయించుకున్నారట. అమితాబ్ పై కొన్ని సన్నివేశాలను ఇంకాస్త బెటర్ గా మళ్ళీ షూట్ చేస్తున్నారని సమాచారం.

- Advertisement -