వర్మ పెట్టిన కులాల కుంపటి…!

287
- Advertisement -

ట్విట్టర్ వేదికగా ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దర్శకుడు రాం గోపాల్ వర్మ,,,మరోసారి సంచలన కామెంట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి స్టార్ ప్రభాస్ కౌగిలించుకుంటున్న ఫోటోను పెట్టి, కులాల కుంపటిని రగిల్చాడు.

online news portal

రీసెంట్‌గా ఆర్ఎ‌ఫ్ సీ లో పక్క పక్కనే షూటింగ్ జరుగుతుండడంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌,, ఖైదీ నెంబర్‌ 150 సెట్‌ కు వెళ్లి చిరంజీవిని కలిశాడు. ఈ సందర్భంలోనే చిరంజీవి, ,,ప్రభాస్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అయితే దీనిపై వర్మ తనదైన స్టైల్లో కామెంట్ చేశాడు. “చిరంజీవి మనస్ఫూర్తిగా ప్రభాస్ ను, ప్రభాస్ మనస్ఫూర్తిగా చిరంజీవిని కౌగిలించుకున్నారని ఎవరైనా నమ్మితే అది వారి మూర్ఖత్వమే”అంటూ పోస్ట్ చేస్తు పెద్ద వివాదానికి తెర తీశాడు.

online news portal

ఇంతటితో ఆగక తన ఉద్దేశాన్ని బట్టబయలు చేస్తూ మరిన్ని ట్వీట్లు చేశాడు. తాను ప్రభాస్ ను ప్రేమిస్తానని, చిరంజీవిని ద్వేషించడాన్ని కూడా ప్రేమిస్తానని చెప్పిన ఆయన, నిజమైన మూగవాళ్లకు ఇది అర్థం కాదని చెప్పుకొచ్చాడు. తనకు కుల పిచ్చి అధికమని, ప్రభాస్ అంటే ఇష్టమని చెబుతూ, కాపులపై చిరంజీవికి ఎలాంటి ఫీలింగ్స్ లేవని, కేవలం కమ్మవారు మాత్రమే ఇందుకు కారణం చెప్పగలరని అన్నాడు.

ఈ ట్వీట్లపై హీరోల అభిమానులు తిట్ల దండకం అందుకోవడంతో,,,వారిని ఉద్దేశించి కూడా చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చాలా మంది అభిమానులు తన ఇంగ్లీష్ ను అర్థం చేసుకోలేరని వాళ్లను క్షమిస్తున్నానని వ్యంగ్యంగా ఛలోక్తి విసిరాడు. దీంతో కొంత మంది అభిమానులు వర్మపై గుర్రుగా ఉన్నారట.

online news portal

ఎప్పుడూ వివాదాలతో దోస్తానా  చేసే వర్మ..తాజా కామెంట్‌ ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి. రాము గురించి తెలిసిన వారేమో ఇది వంగవీటి సినిమాకు పబ్లిసిటీ కోసమే అంటూ బధులిస్తున్నారు. ఇటీవలె సోనియా గాంధీ,,,మాజీ ప్రధానులు వాజ్ పేయి,,పీవి పై కామెంట్ చేసిన వర్మ ఇప్పుడు హీరోల కులంపై వివాదాస్పద వ్యాఖ్యలతో  ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -