నన్ను మోసం చేశారు.. పోలీసులకు వర్మ ఫిర్యాదు..!

93
rgv
- Advertisement -

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని నట్టి క్రాంతి, నట్టి కరుణ ఫోర్జరీ చేశారంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించారు. ‘మా ఇష్టం’ సినిమా షూటింగ్ సమయంలో వాళ్లిద్దరూ నా సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

2020 నవంబర్ 30న తన లెటర్ హెడ్ తీసుకున్నారని… ఆ తర్వాత నకిలీ పత్రాలను సృష్టించి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని వర్మ తెలిపారు. వారికి తాను డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు సృష్టించారని చెప్పారు. ఈ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి వాస్తవాలను తేల్చాలని కోరారు. తన సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉందని… కానీ నకిలీ పత్రాలతో కేసులు వేసి సినిమా విడుదలను అడ్డుకున్నారని వర్మ ఆరోపించారు.

- Advertisement -