సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పవన్ పై మళ్ళీ ట్వీట్ చేశాడు. తాజాగా పవన్ కల్యాణ్ జనసే పార్టీ ప్రజలకు ఆశాజ్యోతి అవుతుందంటూ ఆకాశానికి ఎత్తారు. పోర్న్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా తనకు ఇష్టమని చెబుతూ రెండింటినీ కలిపేశాడు. పోర్న్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయం జిఎస్టీ అంత నిజమైందని కూడా రాశాడు వర్మ.
అంతేకాకుండా పవన్ అంటే ఇష్టమా, లేక పోర్న్ అంటే ఇష్టమా చెప్పాలని ట్విటర్‌లో తనను ఫాలో అవుతున్నవారిని చెప్పమంటూ ఓటింగ్ కూడా పెట్టాడు వర్మ. అయితే ఓ కేసులో పోలీసుల ఎదుట విచారణకు హాజరైన కొద్ది గంటల్లోనే ఇలాంటి పోస్ట్ పెట్టి దుమారం రేపిన వర్మ మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు.
‘పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నెక్ట్స్ ఎలక్షన్స్‌లో ప్రజలకు దారి చూపే ఆశాజ్యోతి అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను’ అంటూ ఓ పాజిటివ్ ట్వీట్ చేశారు. ఏదిఏమైనా వర్మ చర్యలు ఊహాతీతమనే నెటిజన్ల వాదనకు ఈ ట్వీట్స్‌తో మరోసారి బలం చేకూర్చాడు.