రామ్ గోపాల్ వర్మ,,శివ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టాడు. తెలుగులో పలు విజయవంతమైన సినిమాలు తీసి ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాడు. ఆ తర్వాత జెండాను బాలీవుడ్ లో పాతాడు. సర్కార్, రంగీలా, సత్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో నేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో అటు కన్నడ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ,,హిట్ కొట్టాడు. ప్రస్తుతం తెలుగులో,,వంగవీటి,,బాలీవుడ్‌లో సర్కార్ 3 తెరకెక్కిస్తున్న వర్మ కన్ను హాలీవుడ్ పై పడింది. అంతర్జాతీయ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న వర్మ,,అందుకు ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. 340 కోట్లతో తొలి అంతర్జాతీయ సినిమాను తీయబోతున్నానని ప్రకటించాడు. ఆ సినిమా పేరు ‘న్యూక్లియర్’ అని వర్మ ట్వీట్ చేశాడు. సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఏంటో ఓ ఫొటో ద్వారా వెల్లడించాడు.
మామూలు కాలేజ్ గొడవల్లో,సైకిల్ చైన్లతో కొట్టుకునే నేపధ్యంలో,నేను తీసిన “శివ” తో మొదలయ్యిన నా కెరియర్ ఇవ్వాల దేశాల మధ్య గొడవల్లో న్యూక్లియర్ బాంబులు పేల్చుకునే నేపధ్యంలో ఇంగ్లీష్ లో తియ్యబోతున్న“న్యూక్లియర్” వరకూ వచ్చినందుకు, నేను ఒకింత కాకుండా చాలా చాలా గర్వపడుతున్నాను. సి యమ్ ఎ గ్లోబల్ నిర్మించబోతున్న నా ” న్యూక్లియర్” చిత్రంచలనచిత్
ఇంత భారీ బడ్జెట్ కి కారణం ఈ చిత్రానికి ఎంచుకున్న అంశాన్ని ఇంతవరకు ఎవరూ చూడనంత, ఊహించలేనంత స్కేల్ లో తెరకెక్కించాలన్న నా నిర్మాతల నిర్ణయం. ఈ చిత్రం అమెరికా, చైనా, రష్యా, యెమెన్,
న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ ని కూల్చేసినవిమానాలు, రోడ్ల మీద జనాన్ని గుద్ది పడేస్తూ దున్నుకెళ్లే ట్రక్కులు,ప్యారిస్, ముంబాయి వంటి నగరాల్లో వందలమంది అమాయికుల్నిచంపి పారేస్తున్న దృశ్యాలు… ఇలా ఎన్నో ఎన్నెన్నో చూస్తున్నాం వింటున్నాం. కానీ వాటన్నింటికన్నా ఇంకా చాల ఎక్కువుగా అసలు ఊహించటానికే భయపడే అత్యంత భయంకరమైన ఒళ్ళు గగుర్పొడిచే ఆలోచన – ఒక వేళ ఏ టెర్రరిస్ట్ చేతికన్నా న్యూక్లియర్ బాంబ్ దొరికితే అప్పుడు పరిస్థితి ఏమిటి?” – ఇదే “న్యూక్లియర్” చిత్రానికి సంబందించి నా కథ.
చాలా తీవ్రవాద సంస్థలు న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశాలపై కాలుదువ్వుతూ వాటిని కబళించే ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఆలోచనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 70 ఏళ్ల తర్వాత కూడా హిరోషిమా, నాగసాకిలపై పడ్డ న్యూక్లియర్ బాంబ్ ధ్వనులు ఇప్పటికీ ప్రపంచపు కర్ణపుటాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయంటే, ఆ భయం యొక్క మాగ్నిట్యూడ్ ఎంత పెద్దదో అర్థమవుతుంది.
70 ఏళ్ళ క్రిందట జపాన్ లో జరిగిన ఆ విస్ఫోటం పరిస్థితే అలా ఉంటే ,ఇప్పుడు మనమున్న ఈ కాలంలో ఒక పెద్ద సిటీ లోఅటువంటి న్యూక్లియర్ విస్ఫోటనం జరిగితే? కేవలం ఇరాక్,న్యూక్లియర్ బాంబులు కలిగి ఉందేమోనన్న అనుమానంతో ఆ దేశం పై అమెరికా చేసిన దాడి వల్ల,చాలదేశాలమధ్య విద్వేషాలు పెరగడం, మిత్రదేశాలు శత్రుదేశాలుగా మారిపోవడం, గవర్నమెంట్లు కుప్పకూ
” ‘సర్కార్ 3’ రిలీజ్ కాగానే ‘న్యూక్లియర్’ చిత్రం ప్రారంభమవుతుందని వర్మ ట్వీట్ చేశాడు. అమెరికా, రష్యా, చైనా, యెమెన్ లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిపాడు. ఈ చిత్రంలో అమెరికన్, చైనీస్, రష్యన్, ఇండియన్ యాక్టర్స్ ఉంటారని చెప్పాడు. తెలుగులోను,బాలీవుడ్ లోను అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే సంచలనాలు క్రియేట్ చేసిన వర్మ,,,ఫస్ట్ అంతర్జాతీయ మూవీతో ఎలాంటి రిజల్ట్ ను రాబడతాడోననే ఉత్కంఠ మొదలైంది. గ్యాంగ్ స్టర్, రౌడీఇజం,,ఫ్యాక్షన్ ఇలాంటి సినిమాలకు పెట్టింది పైరైన వర్మ,,హాలీవుడ్‌లోను తనదైన జోనర్‌నే ఎంచుకున్నాడు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉగ్రవాదం,,,న్యూక్లియర్ అణుబాంబులు,,ఆధిపత్యపోరులో దేశాల మధ్య తలెత్తే యుద్ధాలు,,,ఇలా సమాజంలో ప్రస్తుత సిచ్యువేషన్‌ను బేస్ చేసుకుని సినిమాను రూపొందించాలను చూస్తున్నాడు. కేవలం ఇండియన్ యాక్టర్స్ మాత్రమే పరిమితం కాకుండా,,అంతర్జాతీయ నటీనటులను ఎంచుకోబోతున్నాడు. ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే వర్మ,,ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.