ప్రస్తుతం సుకుమార్ సినిమా కోసం మేకోవర్ అవుతున్న రామ్ చరణ్ కాలీ సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో చెర్రీ భార్య ఆసక్తికర ట్వీట్ చేసింది. సిటీలో కోడికూతతో తాము నిద్రలేస్తున్నామని ట్వీట్ చేస్తూ కోడితో చెర్రీ దిగిన ఫోటోను షేర్ చేసింది. తమ ఇంట్లోకి కొత్త పెంపుడు జంతువు వచ్చి చేరిందని, రాజమండ్రి ప్రాంత ప్రజలు దానిని బహూకరించారని… తమ కొత్త పెట్ అదేనని, ఆమె చెప్పారు..
ఇక తాను చరణ్‌ను ముద్దుగా మిస్టర్ సి అనిపిలుస్తానని చెప్పుకోచ్చింది. మిస్టర్ సి (చరణ్) నిజంగా తన తర్వాతి చిత్రం పాత్రలోకి లీనమయ్యారని తెలిపింది. ‘చక్కటి అనుభవం. సిటీ మధ్యలో ఉండి కోడికూతతో నిద్రలేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇటీవల తమ ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి చేరిందని ఉపాసన ఆసక్తికర ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. చరణ్ -ఉపాసన జోడీకి గుర్రప్పందేలు అన్నా, గుర్రాల పెంపకం అన్నా చాలా ఇష్టం. చరణ్ గుర్రపు స్వారీలో జెమ్. మగధీరలో అతడు గుర్రంపై స్వారీ చేసిన తీరు యూత్ లో హాట్ టాపిక్ అయ్యింది అప్పట్లో.అయితే గుర్రాలతో, గుర్రపు సాలతో చెర్రీకి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. 2012 లో చరణ్ తన భార్య ఉపాసనకు మినియేచర్ జాతికి చెందిన ఓ గుర్రాన్ని ఐర్లాండ్ నుంచి తెప్పించి బర్త్‌డే కానుకగా ఇచ్చాడు.
14 – 15 ఏళ్లపాటు జీవించే ఈ గుర్రం కేవలం 31 అంగుళాలు మాత్రమే పెరుగుతుంది. ముద్దుగా … ముచ్చటగా కనిపించే ఈ గుర్రం ఉపాసనకి ఎంతగానో నచ్చిందనీ, ఆమె సంతోషం చూశాక ఆ గుర్రం కోసం తాను పడిన శ్రమ మరిచిపోయానని చరణ్ చెప్పాడు. ఏ వజ్రాల హారమో, ఖరీదైన కారో కొనిచ్చినా అంత ఆనందం చూడలేనని అన్నాడు. చరణ్ గుర్రపు సాలలో మినియేచర్ ఒక్కటే కాదు ఇంకా చాలనే గుర్రాలు ఉన్నాయి. వాటిలోనే ఓ గుర్రం పిల్లను కంది.
ఈ బుల్లి గుర్రం పిల్ల ఫోటోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు ఉపాసన.“మా కుటుంబంలోకి కొత్త మెంబర్ వచ్చి చేరింది. ఎంతో అందంగా ఉన్న ఈ ఆరోగ్యమైన పిల్ల తెగ నచ్చేసింది. ఈ ఫోటో తీసినపుడు తన వయసు 3 గంటలు మాత్రమేనని ఉపాసన చెప్పిన సంగతి తెలిసిందే.