ఇటీవల ‘ధృవ’తో మంచి విజయాన్ని అందుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాకుండా నిర్మాతగా మారి తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ నిర్మించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు చరణ్. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తాను హీరోగా సినిమా చేస్తుయునే ఇంకో పక్క సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమా ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి నిర్మాణ పనులనూ చూసుకుంటున్నాడు. ఇలా బిజీ షెడ్యూల్‌తో ఉన్న రామ్ చరణ్.. తనకు సాయం కావాలంటూ అభిమానులను కోరుతూ ఓ వీడియో పోస్టు చేశాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రానికి టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. గడిచిన నెల రోజులుగా సినిమాకు ఏదో మంచి టైటిల్ ఫిక్స్ చేయాలని టీమ్ మొత్తం దర్శకుడు సుకుమార్‌ను కోరుతున్నట్లు చెప్పారు.
చరణ్‌కు జోడీగా సమంత నటిస్తున్న ఈ సినిమాకు నాలుగైదు మంచి టైటిల్స్‌ను సుకుమార్ చెప్పినట్లు తెలిపారు. అయితే, వీటిలో ఏ టైటిల్‌ను ఫైనలైజ్ చేశారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పడం లేదన్నారు. ఇందుకు తనకు అభిమానులు సాయం చేయాలని కోరారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి సినిమాకు వారం నుంచి పది రోజుల్లోగా టైటిల్‌ను ఖరారు చేయమని ట్వీటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా దర్శకుడు సుకుమార్‌ను కోరాలని అభ్యర్థించారు.
మొన్నటి వరకూ మండుటెండల్లో గోదావరి జిల్లాలో షూటింగ్లో పాల్గొన్న చెర్రీ… ఎండల నేపథ్యంలో బ్రేక్ తీసుకున్నాడు. ఈ బ్రేక్ లో భార్య ఉపాసనతో యూరప్‌లోని ఓ మంచుకొండపై భార్యతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దాదాపు ఏడుగంటలపాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి పర్వతశిఖరానికి చేరుకున్నారట. కాగా, ఈ సినిమా షూటింగ్ జూన్ 1 నుండి ప్రారంభం కానుంది.