చరణ్ .. సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ క్రితం నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.
మూడు రోజుల్లో 50+ కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సుకుమార్ సినిమా.. ఇప్పుడు నాలుగు రోజు వసూళ్ళను కలుపుకుని ఏకంగా 63 కోట్ల షేర్ వసూలు చేసింది. కట్ చేస్తే.. నాలుగు రోజులకూ ఓవర్సీస్ వసూళ్ళను కూడా కలిపి గ్రాస్ లెక్కలు చూస్తే.. సినిమాకు 102 కోట్లు వచ్చిందట. అసలు నాలుగు రోజుల్లో 100 కోట్లు వసూలు చేయడం ఒక పెద్ద రికార్డ్. తొలిరోజే మంచి టాక్ రావడం.. అన్ని సెంటర్లలో చరణ్ యాక్టింగ్ కేకలు అంటూ యునినిమాస్ రిపోర్టు రావడంతో.. సినిమా కలక్షన్లపై పాజిటివ్ నోటి మాటలు బాగా ప్రభావం చూపించేశాయి.
అందుకే ఇప్పుడు సినిమాకు ఏకంగా 100 కోట్లు సునాయసంగా వచ్చేశాయి. మొత్తానికి సుకుమార్ .. చరణ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాను అందించేశాడు. దర్శకుడిగా తన ప్రతిభా పాటవాలకు కొలమానంగా ఈ సినిమాను సెట్ చేశాడు.