చరణ్ టైటిల్ పై కసరత్తు..

178
Ram Charan's next with Sukumar
- Advertisement -

సుకుమార్’నాన్నకు ప్రేమతో’ సినిమాతో క్లాస్ ఆడియన్స్ ను అలరించి మంచి విజయం సాదించాడు.ఇప్పుడు చరణ్ మూవీతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ‘ధ్రువ’లో కొత్త లుక్ తో యూత్ ను ఊపేసిన చరణ్,ఇప్పుడు మాస్ ఆడియన్స్ మనసు దోచుకోవడానికి సిద్ధమవుతున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుంది.

Ram Charan's next with Sukumar

ఈ మూవీకి ‘రేపల్లె’ .. ‘ పల్లెటూరి మొనగాడు’ అనే టైటిల్స్ అనుకున్నారాట.ఆ విషయాన్నిసుకుమార్ చరణ్ కి చెప్పాడట. టైటిల్ మరింత కొత్తగా .. క్యాచీగా ఉండేలా చూడమని చరణ్ చెప్పాడని అంటున్నారు. దాంతో టైటిల్ పై కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. మార్చి రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ లోగా టైటిల్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమా తో మరో హిట్ట్ కొడతాడా లేదా వేచి చూడాలి మరి ఈ మూవీ టైటిల్ కోసం కొన్ని పేర్లు కూడా పర్శీలించారని సినివర్గాల సమాచారం

సుకుమార్ ఈ సినిమా ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడో కొంత కాలం వేచి చూడకతప్ఫదు మరి. అంతే కాకుండా ఈ సినిమా కథ చరణ్ కూడా వినిపించడంతో ఓకే అన్నారాట. ఈ కథ నచ్చడం తో కథ తగినట్టుగా టైటిల్ ను పెట్టాలని కొన్ని పేర్లు కూడా పర్శిలించారు.

- Advertisement -