నేడు ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాన్నపై కొడుకుకు ఉండే అభిమానాన్ని ఒక్కమాటలో చెప్పేశారు. నాన్నంటే ఆకాశమంతా అభిమానం ఉంటుంది. బోలెండత భయమూ ఉంటుంది అంటూ చెప్పారు. ఇక నిజ జీవితంలోనూ, నటనలోనూ మా నాన్నే స్పూర్తి అని చెప్పుకొచ్చారు.
మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తండ్రి చిరంజీవికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. నా మార్గదర్శి, నా హీరో, నా స్పూర్తి అన్ని మా నాన్నే అంటూ ఫేస్ బుక్ లో శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి విషయాన్ని తండ్రితో చర్చించి తండ్రి మాటకు విలువను ఇస్తాడని చరణకు టాలీవుడ్ లో మంచి పేరు ఉంది.
ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలొ ఓ సినిమా చేస్తున్నారు. మరోవైపు తండ్రి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. ఖైదీ నంబర్-150 సినిమాతో నిర్మాతగా మారిన చరణ్ మంచి వసూళ్లు సాధించారు. ఇప్పుడు చరణ్ నిర్మిస్తున్న రెండవ చిత్రం సైతం తండ్రి సినిమా కావడం విశేషం. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను చెర్రీ నిర్మిస్తున్నారు.