లవర్, కేరింత లాంటి మంచి విజయాలతో యూత్ ఆడియన్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియన్స్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ వరుడుగా అచ్చ తెలుగు చీరకట్టుతో పదహరణాల తెలుగు పిల్లగా తెలుగు తెరకి పరిచయమయ్యి ప్రతి తెలుగు వారింటి ఆడపడుచులా తన ప్లెజెంట్ నటనతో సుస్థిర స్థానం సాధించుకున్న మెగాప్రిన్సెస్ నిహరిక కొణిదెల వధువుగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్.
ఈ మూవీని యువి క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ దర్శకుడు లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రీరికార్డింగ్ ఎస్.ఎస్.థమన్ అందిస్తున్నారు. యూత్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపనున్నారు. అయితే ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తితో వున్నారు. ఆహ్లాదకరమైన కథా నేపథ్యంలో సాగే ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడనున్నామని భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.