‘విన‌య విథేయ రామ’ సెన్సార్ పూర్తీ…

350
ram charan vvr
- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , మాస్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన మూవీ విన‌య విథేయ రామ‌. ప్ర‌ముఖ నిర్మాత డివివి దాన‌య్య ఈచిత్రాన్ని నిర్మించారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వాని హీరోయిన్ గా న‌టించింది. ఈమూవీ జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకానుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు. దేవి మ్యూజిక్ ఈచిత్ర‌నికి హైలెట్ గా నిల‌వ‌నుంద‌ని చెబుతున్నారు చిత్ర యూనిట్.

vinaya-videya-rama_

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈమూవీ ట్రైల‌ర్ కు మంచి రెస్పాస్ రావ‌డంతో అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించగా, స్నేహా .. ప్రశాంత్ .. ఆర్యన్ రాజేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. రంగ‌స్ద‌లం సినిమాతో చ‌ర‌ణ్ కు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈసినిమాపై భారీగా అంచ‌నాలు పెట్ట‌కున్నారు చ‌ర‌ణ్ అభిమానులు.

- Advertisement -