ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది- చెర్రి

213
ram charan talk about saptagirillb movie
- Advertisement -

కామెడీ కింగ్‌ సప్తగిరి హీరోగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ పతాకంపై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది.

కాగా, ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరి, దర్శకుడు చరణ్‌ లక్కాకుల, సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గానిన్‌, నిర్మాత డా. రవికిరణ్‌ పాల్గొన్నారు.
Saptagiri LLB  theatrical trailer launch stills2ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ”సప్తగిరి అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి ఒక సినిమా చేశాం. మెచ్యూర్డ్‌ కమెడియన్‌ అతను. ఈ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. హిందీ ట్రైలర్‌ కంటే తెలుగులో బాగా చేశారు. క్వాలిటీగా, చాలా కలర్‌ఫుల్‌గా వుంది.

తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. పాటలు కూడా చూశాను. చాలా బాగున్నాయి. బుల్గానిన్‌ మంచి టాలెంట్‌ వున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌. గతంలో నా బర్త్‌డేకి ఒక పాట కూడా చేశాడు. ఈ సినిమాని మెగా అభిమానులే కాకుండా మిగతా పెద్ద హీరోల అభిమానులు కూడా చూసి పెద్ద హిట్‌ చెయ్యాలని, నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Saptagiri LLB  theatrical trailer launch stills1
హీరో సప్తగిరి మాట్లాడుతూ ”ఈరోజు చాలా ఆనందంగా వుంది. జీవితంలో ఎదగాలంటే చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటారు. నేను మెగా అభిమానిగా పుట్టడం నా అదృష్టం. ఒక మెగా అభిమాని హీరోగా ఎదగడం కోసం పవన్‌కళ్యాణ్‌గారు, రామ్‌చరణ్‌గారు, సాయిధరమ్‌ తేజ్‌గారు అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను.

మెగా అభిమానులందరూ గర్వపడేలా, వారి గౌరవం నిలబెట్టేలా ఈ సినిమా వుంటుంది. ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ ట్రైలర్‌ రిలీజ్‌ చెయ్యాల్సిందిగా కోరగానే ఎంతో మంచి మనసుతో అంగీకరించిన రామ్‌చరణ్‌గారికి నా ధన్యవాదాలు” అన్నారు.

- Advertisement -