క్రెడిట్ అంతా సుకుమార్‌దే..

203
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న రంగస్థలం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం ఓవర్సిస్‌లోనూ సత్తా చాటుతోంది.

తాజాగా హైదరాబాద్‌లో రంగస్థలం విజయోత్సవం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా రాగా మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్‌ రంగస్థలం విజయోత్సవ సభ బాబాయ్ పవన్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రంగస్థలం చిత్రానికి బాబాయ్ ఇచ్చిన ప్రశంసలు ఎప్పటికి మర్చిపోలేనని తెలిపారు.

బాబాయ్ ఎదురుగా ఉంటే మాటలు రావడం లేదనన్నారు. రంగస్థలం సినిమా గురించి విన్న తరువాత ఆయన ఇంటికి పిలిచారు. సినిమా చాలా బాగుందంటున్నారు అంటూ ప్రశంసించారు. థియేటర్‌లో బాబాయ్‌తో కలిసి ‘రంగస్థలం’ సినిమా చూశానని తెలిపారు. మొదటిగా మా అమ్మ, నాన్నలు ఈ సినిమా చూసి భావోద్వేగంతో నన్ను హద్దుకున్నారన్నారు. మా అమ్మ చాలా ఎమోషన్ అవుతూ.. నన్ను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. అంతకంటే పెద్ద ప్రశంస ఏముంటుందన్నారు.

rangasthalam

చిట్టిబాబు పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆ క్రెడిట్ దర్శకుడు సుకుమార్‌దే అన్నారు. చిట్టిబాబుని ఆదరించిన ప్రేక్షకులు ధన్యవాదాలు. ఈ సినిమా చూసి నన్ను ప్రశంసించినవాళ్లలో ముగ్గురి గురించి ప్రధానంగా చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్‌లకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు రామ్ చరణ్.

- Advertisement -