కొత్త చరణ్‌ని పరిచయం చేశాడు…

254
Ram Charan speech at Rangasthalam pre release
- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. మార్చి 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. వైజాగ్‌లో ఆదివారం అంగరంగవైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన చరణ్‌ ఇంత మంచి సినిమా చేయడానికి కారణమైన సుకుమార్‌కు హ్యాట్సాఫ్ అన్నారు. నాకే ఓ కొత్త చరణ్‌ని పరిచయం చేశాడని తెలిపారు.

గ‌డ్డం లుక్‌, లుంగీని బాగా ఎంజాయ్ చేశాను. నా అమ్మానాన్న‌ల‌తోపాటు ఫ్యాన్స్ గ‌ర్వ‌ప‌డే సినిమాను సుకుమార్ నాకు ఇచ్చారని తెలిపారు. ఆప‌ద్భాంవుడు సినిమాకు పూడిప‌ల్లి గ్రామానికి తీసుకెళ్లారు. త‌ర్వాత నేను ప‌ల్లెటూరుకి వెళ్ల‌లేదు. ఈ సినిమాతో సుకుమార్ నా కోరికను తీర్చాడని తెలిపారు. సమంత మంచి కో ఆర్టిస్ట్‌…ఆమెతో నటించేటప్పుడు ఓ ఎనర్జీ వస్తుందన్నారు.

దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని ఇచ్చాడని ఇక చంద్రబోస్ పాటలు సినిమాకే హైలైట్‌గా మారాయన్నారు. ర‌త్న‌వేలుగారు ఓ ఊరుని ఎంతో అందంగా ఉండాలో అంత అందంగా చూపించారు. అలాగే రామ్‌ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ ఎమోష‌న్స్‌తో పైట్స్‌ను కంపోజ్ చేశారని సినిమా తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్నారు.

- Advertisement -