మెగాస్టార్ చిరంజీవి తన కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150తో.. ఇండస్ట్రీలో తన స్థాయి ఏంటో చెప్పేశారు చూపించేశారు. దశాబ్దం తర్వాత ఎంట్రీ ఇచ్చి మాస్ మూవీతో ఇండస్ట్రీ రికార్డులన్నీ తుడిచిపెట్టేశారు. మరి మెగా 151 సంగతేంటి అనే ప్రశ్న కొన్ని రోజులుగా వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను.. మెగాస్టార్ తన 151వ చిత్రంగా చేస్తున్నారనే విషయం తెలిసినా.. అధికారిక ప్రకటన లేదు.
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నాడు రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్.. ఇవాల్టితో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి కాగా.. షూటింగ్ తో పాటు అభిమానులను అలరిస్తున్నాడు చెర్రీ. ఈ సమయంలో మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వినిపించాడు. ‘నాన్న తన 151వ చిత్రంలో గొప్ప పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను కూడా నేనే నిర్మిస్తున్నాను. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోనుంది’ అని చెప్పాడు చెర్రీ.

ఖైదీ నంబర్ 150`వ సినిమా ఘన విజయం సాధించింది అంటే కారణం ప్రేక్షకాభిమానులే. 100 రోజులు సినిమా ఆడటం అనేది ఎప్పుడో పోయింది. కానీ `ఖైదీ నంబర్ 150`వ సినిమా 100 రో జులు ఆడింది. అది మీవల్లే అన్నారు. నాన్న 151వ సినిమా ఆగస్టులో ప్రారంభం అవుతుంది. ఇంత వరకూ ఆయన ఇలాంటి పాత్రలో కనిపించలేదు. కచ్ఛితంగా పెద్ద విజయం సాధిస్తుందని చరణ్ అన్నాడు.
మరి ఇదే సందర్బంలో చరణ్… బాబాయ్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారని. ఆయన సమ్మర్ ను సైతం లెక్క చేయకుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారని. అందుకు ఆయనకు హ్యాట్సాఫ్ అని చెప్పాడు. బాబాయ్ ఏ కార్యక్రమం చేసినా ఆయన వెన్నంటే ఉండాలి. రాజకీయ పరంగానైనా..ఇంకేదైనా. భారతదేశంలో మెగా అభిమానులంతా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు అని అభిమానుల ఉద్ధేశించి అన్నారు.మరి బాబాయ్ ఏ కార్యక్రమం చేసినా మెగా ఫ్యాన్స్ అంతా ఆయనకు అండగా నిలవాలని అభిమానులకు పిలుపునిచ్చాడు చెర్రీ.

