చరణ్‌- శంకర్‌ మూవీ నుండి క్రేజీ అప్‌డేట్‌..

168
Ram Charan
- Advertisement -

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, కోలీవుడ్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాన్ ఇండియా చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు.. దర్శకుడు శంకర్ ను కలిసి ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి చర్చించారు. మొత్తానికి తమ చిత్రాన్ని సెప్టెంబరు లోపే ప్రారంభించాలని దిల్ రాజు పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు శంకర్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

ఈ విషయాన్ని చరణ్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఆదివారం చెన్నైలో గొప్ప రోజుని గడిపాము. శంకర్‌గారు, ఆయన కుటుంబ సభ్యులు అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించారు. ఆర్‌సీ 15 కోసం ఎదురుచూస్తున్నాను. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తాం” అని చరణ్‌ ట్వీట్‌ చేశారు.

అయితే ఆర్‌సీ 15ను శంకర్‌ డైరెక్షన్‌లో చేయబోతున్నట్లు చరణ్‌ ప్రకటించిన తర్వాత, ఇండియన్‌ 2 సినిమాను పూర్తి చేయకుండా శంకర్‌ మరో సినిమా ఎలా చేస్తాడంటూ లైకా ప్రొడక్షన్స్‌ కోర్టులో కేసు వేసింది. అయితే కోర్టు శంకర్‌కు అనుకూలంగా తీర్పునివ్వటంతో ఇప్పుడీ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించడానికి నిర్మాత దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నారు.

దిల్‌రాజు నిర్మాతగా రూపొందనున్న 50వ చిత్రమిది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఈ సినిమా తర్వాత శంకర్ తో సినిమాను పట్టాలెక్కించేందుకు రామ్ చరణ్ కూడా ఉత్సాహంగా ఉన్నాడు.

- Advertisement -