పవన్‌తో మల్టీస్టారర్‌ చేస్తా!

78
charan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్‌ సినిమా చేయాలనుందని తెలిపారు రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య ఈ నెల 29న విడుదల కానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు చరణ్‌.

బాబాయ్ పవన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తానని తెలిపారు. ఇక ఆచార్య ఎవరితో తీసినా హిట్ అవుతుందని తెలిపారు. కథ బాగుందని అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. విజయం ఎప్పుడూ బాధ్యతల్ని పెంచుతుంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో అదే జరిగిందన్నారు

మగధీర తరవాత ఇలానే ప్లాన్‌ చేసి ‘ఆరెంజ్‌’ తీశాం. ఓ సింపుల్‌ కథని చేద్దాం అనుకొన్నాం. ‘ఆరెంజ్‌’ నా మనసుకి నచ్చిన సినిమా. కానీ వర్కవుట్‌ కాలేదన్నారు. దర్శకుడి ఆలోచనకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకున్నప్పుడే విజయాలు వస్తాయని తెలిపారు.

- Advertisement -