ధనుష్‌ మూవీపై మెగాహీరో కన్ను..!

500
- Advertisement -

ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కళ్లైపులి ఎస్ థాను నిర్మించిన ‘అసురన్’ చిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ కెరీర్ లో రికార్డు స్థాయి గ్రాసర్ గా నిలవడంతో పాటు మరోసారి ఈ చిత్రంతో ధనుష్ విమర్శల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ విడుదలైన కొద్దిరోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. అయితే మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌ ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ramcharan

అసురన్ చిత్రంలో హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో ఈ చిత్రాన్ని మెగా హీరో రామ్ చరణ్ రీమేక్ చేయాలని ఆశ పడుతున్నాడట. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తే తప్పకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకంతో మెగా కాంపౌండ్ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కాగా రాంచరణ్‌ ప్రస్తుతం RRRలో నటిస్తున్న విషయం తేలిసిందే. దీంతో పాటు కొరటాల-చిరు కాంబోలో వస్తున్న మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు కొరటాల మూవీ తరువాత చిరంజీవి కథానాయకుడిగా ఓ మలయాళ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో చరణ్ వున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా రూపొందిన ‘లూసిఫర్’ ను తెలుగులోకి రీమేక్ చేయాలనే ఉద్దేశంతో చరణ్ ఆ హక్కులను దక్కించుకున్నాడు.

- Advertisement -