రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ టీజర్..?

275
- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్ధలం 1985. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రామీణ కథా నేపథ్యంగా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్టులుక్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. రామ్ చరణ్ తన ఫేస్‌ బుక్‌ ద్వారా ఈ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్‌ను ఎప్పుడు వదులుతారా అనే ఆసక్తితో అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Ram Charan 'Rangasthalam 1985' Teaser?

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. నిజానికి ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవడంతో, అభిమానులు నిరుత్సాహా పడకుండ టీజర్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

పీరియడిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, వైభవ్‌, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నారు.

- Advertisement -